అమెరికాలో ఘనంగా బాటా ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు నిర్వహించనున్న నిర్వాహకులు

రిపోర్టర్: మహేష్ స్థలం: San Ramon

అమెరికాలోని శాన్ రామన్ నగరంలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి తేదీన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విండెమేర్ రాంచ్ మిడిల్ స్కూల్ వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సమీరా భరద్వాజ్ లైవ్ కన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని పేర్కొన్నారు. ప్రవాస తెలుగువారందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి పండుగను ఆనందంగా జరుపుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.