ఏపీ స్థానిక ఎన్నికల తీర్పుపై సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ పిటిషన్ దాఖలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. వార్డుల విభజన మరియు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. హైకోర్టు తీర్పును తప్పుపడుతూ అత్యవసర విచారణ జరపాలని సీజేఐ ధర్మాసనాన్ని న్యాయవాది కోరగా, త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.