చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం: విద్యుత్ శాఖ మంత్రి డ్రైవర్ దుర్మరణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: పలనాడు

చిలకలూరిపేటలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ మంత్రి డ్రైవర్ తన్నీరు శ్రీహరి మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన బైక్పై చెరువు రోడ్డు వైపు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టిందని చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీహరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు.