వైద్య సహాయం కోసమే ముఖ్యమంత్రి సహాయ నిధి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తాండూరు

తాండూర్ మండలం రేచీని గ్రామ పంచాయతీలో పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబోయిన శంకర్ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క నిరుపేద కూడా వైద్య సహాయం అందక ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేస్తుందని తెలిపారు. మండలంలోని నిరుపేదలు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.