అంతర్జాతీయ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్లో నెల్లూరుకు 893వ ర్యాంకు

రిపోర్టర్: రాము స్థలం: నెల్లూరు

అంతర్జాతీయంగా వేగవంతమైన ఆర్థిక పురోగతి సాధిస్తున్న నగరాల జాబితాలో నెల్లూరు చోటు దక్కించుకుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సంస్థ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ సర్వేలో నెల్లూరు నగరం 893వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆర్థిక వ్యవస్థ, మానవ వనరులు, జీవన ప్రమాణాలు, పర్యావరణం, పాలన తదితర ఐదు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో ఉండటం, ఉత్పాదక రంగం మరియు ఆక్వాకల్చర్ అభివృద్ధి నగరానికి ఈ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టాయి.