విజయవాడలో ఐబీపీఎస్ పరీక్షలో హైటెక్ మాల్ ప్రాక్టీస్ గుట్టు రట్టు

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

విజయవాడలో జరిగిన ఐబీపీఎస్ నియామక పరీక్ష కేంద్రంలో హైటెక్ మాల్ ప్రాక్టీస్ కలకలం రేపినట్లు ఇన్విజిలేటర్లు తెలిపారు. పరీక్ష రాస్తున్న ఒక అభ్యర్థి రహస్యంగా కెమెరా, రిమోట్ పరికరాలు అమర్చుకుని ప్రశ్నపత్రాన్ని బయటకు చేరవేసే ప్రయత్నం చేశాడని అధికారులు పేర్కొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న అభ్యర్థిని తనిఖీ చేయగా మొబైల్ ఫోన్ లో ఫొటోలు, వీడియోలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం అందింది.