భారత్ లో త్వరలో విడుదల కానున్న ఒప్పో కే14 ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: భారతదేశం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో త్వరలో భారత్ లో కొత్తగా ఒప్పో కే14 ప్లస్ 5జీ ఫోన్ ను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 29న ఈ కొత్త ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయించనున్న ఈ స్మార్ట్ ఫోన్ శక్తివంతమైన 8000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మాక్స్ చిప్ సెట్ మరియు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో మార్కెట్లోకి రానుంది.