మట్టి వినాయకుల పంపిణీ.. 108 ప్రతిమలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని రామాలయ ప్రాంగణంలో యజ్ఞ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు నల్ల భూమిక మాట్లాడుతూ గత మూడేళ్లుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.