అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన కొణిదెల నియామకం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా ఉపాసన కొణిదెల బాధ్యతలు స్వీకరించారు. దేశవ్యాప్తంగా అపోలో గ్రూప్ చేపడుతున్న సుమారు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయల భారీ విస్తరణ కార్యక్రమాలకు ఆమె నాయకత్వం వహించనున్నారు. తాతయ్య ప్రతాప్ సి. రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఉపాసన పేర్కొన్నారు. కొత్త బాధ్యతలతో పాటు డిజిటల్ వెల్‌నెస్, సీఎస్ఆర్ కార్యకలాపాలను యథావిధిగా కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.