విద్యుత్ ఉత్పత్తి ప్రయత్నాలను విమర్శిస్తారా: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విమర్శించడంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో బొగ్గు కొరతపై కేంద్రంతో మాట్లాడామని, గత పాలకులు నాణ్యతపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ప్లాంట్ చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్‌ను సస్పెండ్ చేశామని, విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.