స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలో జరిగిన మైనర్ బాలిక సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారని అధికారులు తెలిపారు. గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్లీపర్ బస్సులో ఆగస్టు నాల్గవ తేదీ రాత్రి ఈ అఘాయిత్యం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్ లపై ఫోరెన్సిక్ ఆధారాలతో సహా 398 పేజీల చార్జిషీట్ సమర్పించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్పందించి విచారణ చేపట్టిందని అధికారులు తెలిపారు.