పాశ్చాత్య దేశాల ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
అంతర్జాతీయ వాణిజ్యాన్ని, దౌత్య ఒత్తిళ్లను పాశ్చాత్య దేశాలు ఆయుధంగా వాడుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. దిల్లీలో జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ, రష్యాపై 30 వేలకుపైగా ఆంక్షలు విధించారని తెలిపారు. జి-7 దేశాల తీరును ఎండగట్టిన ఆయన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల పాత్రే కీలకమని స్పష్టం చేశారు. కష్టకాలంలోనూ రష్యా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు.