కృత్రిమ మేధపై అతిగా ఆధారపడి ఉద్యోగం కోల్పోయిన ఐటీ ఉద్యోగి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
కృత్రిమ మేధపై పూర్తిగా ఆధారపడి విధుల నిర్వహణలో వెనుకబడిన ఒక అనుభవజ్ఞుడైన ఐటీ ఉద్యోగిని కంపెనీ బెంచ్పై కూర్చోబెట్టినట్లు రెడిట్ వేదికగా ఓ ఉద్యోగి వెల్లడించారు. ఈ ఉదంతంపై ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత, ఆర్థిక పొదుపు ప్రాముఖ్యతపై పెద్దఎత్తున చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. ఉద్యోగులు అత్యవసర నిధులను ఏర్పాటు చేసుకోవాలని, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని రెడిట్ పోస్టులో సహచర ఉద్యోగులకు ఆయన హితవు పలికారు.