మహిళా ప్రజాప్రతినిధులపై దౌర్జన్యం: గవర్నర్‌ను కలిసిన కేటీఆర్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులకు తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.