భారీ వర్షాలతో డుడుమ రిజర్వాయర్కు పోటెత్తిన వరద నీరు

రిపోర్టర్: కృష్ణ స్థలం: అల్లూరి సీతారామరాజు జిల్లా

ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులోని మాచ్ఖండ్ జలవిద్యుత్ ప్రాజెక్టు డుడుమ రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో పెరగడంతో దిగువన ఉన్న బలిమెల రిజర్వాయర్కు అధికారులు రెండు గేట్ల ద్వారా పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,587 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.