తెలంగాణ పారిశ్రామిక శక్తి చాటాంటూ రక్షా ఎక్స్పో 2026 సన్నాహాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: సూర్యాపేట

రక్షా ఎక్స్పో కర్టెన్ రైజర్లో తెలంగాణ పారిశ్రామిక సామర్థ్యాన్ని వివరించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బోయింగ్, ఎయిర్బస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో హైదరాబాద్లో అభివృద్ధి చెందిన ఏరోస్పేస్ రంగాన్ని ప్రస్తావించామన్నారు. డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రక్షా ఎక్స్పో జరగనుందని పేర్కొంటూ, ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రం సాధిస్తున్న అద్భుత ప్రగతిని ప్రపంచ వేదికపై గర్వంగా చాటిచెప్పామని వెల్లడించారు.