పేదలకు త్రీడీ ఇళ్లు: కేవలం ఐదు లక్షల పది వేల వ్యయం
రిపోర్టర్: హరి
స్థలం: గుంటూరు
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద దేశంలోనే తొలిసారిగా త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ విధానంలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో ప్రయోగాత్మకంగా నిర్మించనున్న ఈ గృహాల నిర్మాణ వ్యయాన్ని ఐదు లక్షల పది వేల రూపాయలుగా ఖరారు చేసినట్లు కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.