వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ సూపర్ స్టార్: శ్రీకాంత్

రిపోర్టర్: సతీష్ స్థలం: India

దులీప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించారు. తన భార్య కూడా వైభవ్ ఆట కోసమే దులీప్ ట్రోఫీని చూస్తోందని, అతడు భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడని కొనియాడారు. రెడ్ బాల్ క్రికెట్‌లో భయం లేకుండా ఆడుతున్న ఈ కుర్రాడు, త్వరలోనే అన్ని ఫార్మాట్లలో సూపర్ స్టార్‌గా ఎదుగుతాడని శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.