వైభవంగా శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల పందిరి రాట
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: విజయనగరం
విజయనగరం ప్రజల కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుంచి వచ్చే నెల 11వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా స్థానిక చదురు, వనం గుళ్లలో సంప్రదాయబద్ధంగా పందిరి రాట మహోత్సవం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అథితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసు నాయుడు పాల్గొన్నారు. పందిరి రాట క్రతువులో ఎమ్మెల్యే అథితి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.