బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో వేదిక పంచుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రిపోర్టర్: వెంకట్ స్థలం: సిద్దిపేట

గజ్వేల్ లో బీఆర్ఎస్ నేత హరీశ్ రావుతో కలిసి రేషన్ డీలర్ల సమావేశంలో పాల్గొన్న జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యవహారం కలకలం రేపింది. తమకు సమాచారం ఇవ్వకుండా వెళ్లడంపై సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకత్వం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామాలపై స్పందించిన పీసీసీ చీఫ్, ఎమ్మెల్యే తీరును క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.