ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: నిరసనకు వస్తున్న సీజేపీ మద్దతుదారుల ముందస్తు అరెస్టులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలో ఆందోళన చేపట్టేందుకు వస్తున్న సీజేపీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు. నిరసనకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేస్తూ ప్రముఖులను, యూట్యూబర్లను డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి వాహనాలను తీవ్రంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.