బ్రిక్స్ సదస్సుపై శశిథరూర్ భిన్నమైన వ్యాఖ్యలు.

రిపోర్టర్: రమేష్ స్థలం: New Delhi

బ్రిక్స్ సదస్సు ప్రయోజనాలపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం సందేహాలు వ్యక్తం చేయగా, ఆయన పార్టీ సహచరుడు శశిథరూర్ భిన్నంగా స్పందించారు. బ్రిక్స్ కూటమి భారత్ దౌత్యపరమైన సమన్వయ శక్తిని చాటుతుందని థరూర్ సమర్థించారు. గ్లోబల్ సౌత్ దేశాలకు ఇది ముఖ్యమైన వేదికని పేర్కొన్నారు. చిదంబరం వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ ఆయనపై మండిపడింది.