గంగాధరనెల్లూరు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచి దూసుకెళ్లిన టీడీపీ అభ్యర్థులు
రిపోర్టర్: పి రాజేష్ కుమార్
స్థలం: గంగాధర నెల్లూరు
గంగాధరనెల్లూరు మండలం నాశంపల్లి, కలిజవేడు, వెంకటాపురం గ్రామాల్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శాసనసభ్యులు వీఎం థామస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు. ఎంపీటీసి అభ్యర్థి కె.హరీష్ మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు మరియు గ్రామస్థులు ఈ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.