హంద్రీనీవా ప్రాజెక్టుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: రాము
స్థలం: తూర్పు గోదావరి
శ్రీశైలం నుంచి కుప్పం వరకు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించి కృష్ణా జలాలు తరలిరావడం ఒక చారిత్రాత్మక సాగునీటి మైలురాయి అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటిని సాధించడంపై రాజకీయంగా విభేదించే నేతలు కూడా దీనిని ఉదాహరణగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారిందని ఆయన వెల్లడించారు. నీరు అందుబాటులో ఉంటేనే అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.