బెంగళూరులో భార్యపై యాసిడ్ పోసి కత్తితో పొడిచిన భర్త
రిపోర్టర్: కృష్ణ
స్థలం: బెంగళూరు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని జేపీ నగర్ పరిధిలో గురువారం ఉదయం ఘోరం జరిగింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 26 ఏళ్ల ప్రైవేట్ ఆస్పత్రి నర్సుపై ఆమె భర్త యాసిడ్‌తో దాడి చేసి, ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుల్స్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.