భారత్, న్యూజిలాండ్ చివరి టీ20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా చివరిదైన ఆఖరి మ్యాచ్ లో కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తలా రెండు మార్పులు చేశాయని కెప్టెన్లు తెలిపారు. ఇప్పటికే తొలి మూడు మ్యాచ్లు గెలిచి మూడు ఒకటితో ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఈ ఆఖరి మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను ఘనంగా ముగించాలని పట్టుదలగా ఉంది.