షాకింగ్ డీల్: షారుఖ్ ఖాన్ కింగ్ సినిమాకు భారీ ఓవర్సీస్ హక్కులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: హైదరాబాద్
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటిస్తున్న మోస్ట్ అawaited తాజా చిత్రం కింగ్ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్ర విదేశీ పంపిణీ హక్కులను దుబాయ్ కి చెందిన ఫార్స్ ఫిల్మ్స్ సంస్థ ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారతీయ సినిమాలకు లభించిన విదేశీ పంపిణీ హక్కుల కనీస హామీ ఒప్పందాల్ లో ఇదే అత్యధికమని విశ్లేషకులు పేర్కొన్నారు.