నూతన పెన్షన్ దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలి.. జనసేన నాయకులు గొర్లే వీరవెంకట్

రిపోర్టర్: MADHIRI CHANTIBABU స్థలం: జి.కె.వీధి

నూతన పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలా తక్షణ చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు గొర్లే వీరవెంకట్ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి సచివాలయ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్లకు ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆర్వీ నగర్ సచివాలయంలో ఓటీపీ సమస్యలు తీవ్రంగా ఎదురవుతున్నందున, పెన్షన్ దరఖాస్తులను నేరుగా జీకే వీధి సచివాలయంలోనే స్వీకరించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీడీవోను ఆయన కోరారు.