పర్యావరణ హితం కోసం స్వయంగా మట్టి గణపతి ప్రతిమలు తయారు చేసిన విద్యార్థులు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా స్వయంగా మట్టి గణపతి ప్రతిమలను తయారు చేశారు. పర్యావరణ హిత వినాయక విగ్రహాల వినియోగంపై సమాజంలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మట్టితో సుందరమైన వినాయక ప్రతిమలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు మంజుశ్రీ తదితరులు పాల్గొన్నారు.