ఈసీనెట్ సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఈసీనెట్ సాఫ్ట్‌వేర్ విధానంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఓటర్ల జాబితా రూపకల్పనలో కేంద్రీకరణ పెరిగిందని, స్థానిక అధికారుల అధికారాలను హరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ ఈసీనెట్ యాప్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కొరవడిందని, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.