గుజరాత్లో వెయ్యి కోట్ల నకిలీ రాజకీయ విరాళాల కుంభకోణం భగ్నం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Gujarat
భారతీయ నేషనల్ జనతాదళ్ పార్టీ పేరుతో భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన వైనం వెలుగుచూసిందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ కేంద్రంగా నడిచిన ఈ దందాలో ఐదు సంవత్సరాల్లో రూ. 1,143 కోట్ల నకిలీ విరాళాలు సేకరించినట్లు తేలిందని వారు పేర్కొన్నారు. బోగస్ రసీదుల ద్వారా పన్ను మినహాయింపులు పొంది ప్రభుత్వానికి రూ. 343 కోట్ల మేర నష్టం చేకూర్చారని, ఈ సిండికేట్ సూత్రధారి సురేంద్రకుమార్ విఠల్‌భాయ్ గజేరాతో పాటు ఇతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.