బొల్లారం ఆర్మీ ఆయుధాగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: తెలంగాణ
సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాగారం చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. మాజీ ఆర్మీ హావల్దార్ మల్లేశ్‌తో పాటు నలుగురిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఆర్మీ నుంచి తొలగించారన్న కక్షతోనే మల్లేశ్ పిస్టల్స్, బుల్లెట్లు చోరీ చేసి నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లో పాతిపెట్టాడు. నిందితుడి నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.