రాహుల్ గాంధీ అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన మంత్రి భట్టి విక్రమార్క
రిపోర్టర్: విజయ్
స్థలం: ఖమ్మం
ఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు ఇండియా కూటమి నేతల అక్రమ అరెస్ట్‌ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమగ్రతను కోరుతూ శాంతియుతంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. పోలీసు బలాలను ఉపయోగించి గొంతు నొక్కాలని చూస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయని ఆయన తెలిపారు.