గంగాధరనెల్లూరులో ఘనంగా వినాయక చవితి: కె.నాశంపల్లిలో ఉత్సాహంగా వేడుకలు

రిపోర్టర్: పి రాజేష్ కుమార్ స్థలం: గంగాధర నెల్లూరు

చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం కె.నాశంపల్లి గ్రామంలో యూత్ మరియు గ్రామస్థుల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి పూజను యూత్ లీడర్ పి.పూర్ణచంద్ర గ్రామస్థుల నడుమ భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, పిల్లలు పెద్దఎత్తున పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.