అమరావతిలో అంతర్జాతీయ చెస్ అకాడమీ: మంత్రి లోకేశ్‌ను కోరిన కోనేరు హంపి
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్థాయి చెస్ అకాడమీని ఏర్పాటు చేయాలని ప్రఖ్యాత చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో హంపి, ఆమె తండ్రి అశోక్‌తో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. అకాడమీ స్థాపనకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.