సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన: రైతుల విద్యుత్ సమస్యలపై ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల, అక్కనేపల్లి, అంక్షాపూర్ గ్రామాలలో మాజీ మంత్రి హరీష్ రావు ఆఫీస్ ఆధ్వర్యంలో పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా నర్మెట సబ్ స్టేషన్ను సందర్శించిన హరీష్ రావు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.