నా జోలికి వస్తే తీవ్ర పరిణామాలు: విపక్షాలపై యరపతినేని శ్రీనివాసరావు ఫైర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: గురజాల

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని, అనవసరంగా మాట్లాడితే అంతుచూస్తామని గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ప్రత్యర్థులను తీవ్రంగా హెచ్చరించారు. తన ఓర్పును బలహీనతగా భావించవద్దని ఆయన స్పష్టం చేశారు. ఒక చేత్తో నాగలి, మరో చేత్తో తుపాకీ పట్టుకుని పోరాడిన చరిత్ర తనకు ఉందని ఆయన గుర్తుచేశారు. వైరి వర్గాలు పరిధి దాటి ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యరపతినేని ఘాటుగా హెచ్చరించారు.