ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం అర్బన్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ఖమ్మం వెలుగుమట్లలో జరుగుతున్న నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయా ఇళ్ల నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటూ త్వరలోనే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.