ఖమ్మం రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని సస్పెన్షన్
రిపోర్టర్: హరి
స్థలం: ఖమ్మం
ఖమ్మం రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగినిని తహసీల్దార్ సస్పెండ్ చేశారు. వ్యక్తిగత విషయాలను కార్యాలయానికి తీసుకురావడం వల్ల సిబ్బందికి ఇబ్బందులు కలుగుతున్నాయని తోటి సిబ్బంది చేసిన ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఆమెను ఆదివారం నుంచి విధులకు రావద్దని స్పష్టం చేశారు.