ఘనంగా ముగిసిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మంత్రి నారా లోకేశ్‌ పర్యవేక్షణలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 47 రోజుల్లో 1.10 కోట్ల ఇళ్లను (81.11 శాతం) పార్టీ శ్రేణులు సందర్శించాయి. రెండేళ్ల కూటమి పాలన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేశారు. కోట్లాది ప్రజలకు ప్రభుత్వానికి తెదేపా శ్రేణులు వారధిగా నిలిచారని లోకేశ్‌ తెలిపారు. శ్రేణుల అంకితభావం వల్లే ఇది సాధ్యమైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.