కండలేరుకు కృష్ణా జలాలు రప్పించాలి: రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మిడతల రమేశ్

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

అంతర్రాష్ట్ర ఒప్పందాల ప్రకారం కండలేరు జలాశయానికి కృష్ణా నికర జలాలను రప్పించి చెన్నైకి తాగునీరు విడుదల చేయాలని నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. భాజపా నాయకులతో కలిసి బుధవారం కండలేరు డ్యామ్లో నీటి నిల్వలను ఆయన పరిశీలించారు. జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఒప్పందాల ప్రకారం కృష్ణా జలాల వాటాలను రప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.