రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా గాసిప్ పాలనేనన్న దూదిమెట్ల

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

రేవంత్ రెడ్డి పాలన కేవలం గాసిప్ పాలనగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించి జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ వేసినా రేవంత్ ప్రభుత్వం కనీసం ఎలుక తోకను కూడా పట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అవినీతి ఆరోపణలు కూడా నిరూపించలేదని విమర్శించారు.