'పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆత్మహత్య': నెల్లూరు జీజీహెచ్లో విషాదం
రిపోర్టర్: విజయ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా జీజీహెచ్లో పోలీసుల అరెస్టు భయంతో చికిత్స పొందుతున్న చెంచయ్య(52) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగం మండలానికి చెందిన చెంచయ్య కుటుంబ వివాదం నేపథ్యంలో కుమారుడిపై దాడికి యత్నించగా, పోలీసులు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చేరిన ఆయన, పోలీసులు విచారించి వెళ్లిన తర్వాత బుధవారం తెల్లవారుజామున బాత్రూమ్లో ఉరేసుకుని మృతి చెందాడు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.