మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా షెడ్యూల్‌పై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ అనుకున్నదానికంటే ఎక్కువ రోజులు సాగడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రభావం పడింది. అయితే ప్యారడైజ్ విడుదల తర్వాత కొద్దిగా బ్రేక్ తీసుకొని మెగాస్టార్‌తో సినిమా కచ్చితంగా ప్రారంభిస్తానని స్వయంగా ఓదెల తెలపడంతో ఈ సినిమాపై నెలకొన్న సందిగ్ధతకు తాత్కాలికంగా తెరపడింది.