పవిత్ర అమావాస్య వేళ ఆదిలాబాద్ శనీశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ సాంస్కృతిక కేంద్రంలోని శనీశ్వర ఆలయంలో పవిత్ర శని, పితృ అమావాస్యల అరుదైన కలయిక సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేకువజాము నుంచే తరలివచ్చిన భక్తులు శనీశ్వర విగ్రహానికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకం చేశారు. శని దోష నివారణ కోసం స్వామివారికి నల్లని వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ సుభాష్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.