కోనసీమ జిల్లాలో తుపాను ముప్పు: భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసిన పోలీసులు

రిపోర్టర్: శివ స్థలం: కోనసీమ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుపాను ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొలమూరు పోలీస్ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోనసీమ పోలీసులు స్పష్టం చేశారు. అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.