ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో గంజాయి మొక్కలు కలకలం

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో గంజాయి మొక్కలు వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపింది. విద్యాక్షేత్రంలో మత్తు పదార్థాల మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించిన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొక్కలు ఎక్కడ నుంచి వచ్చాయి, దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో సమగ్రంగా దర్యాప్తు జరపాలని వర్సిటీ అధికారులు కోరారు. గత కొంతకాలంగా క్యాంపస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.