గిరిజనులకు సులభతరమైన రవాణా: కునుకూరు–పోకలపాలెం బీటీ రోడ్డు ప్రారంభం

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: కొయ్యూరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బుదరాళ్ల పంచాయతీ పరిధిలో కునుకూరు నుంచి పోకలపాలెం వరకు మూడున్నర కిలోమీటర్ల మేర రెండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన నూతన బీటీ రోడ్డును కోఆపరేటివ్ చైర్మన్ సుమర్ల సాంబశివ అధికారికంగా ప్రారంభించారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో గిరిజన గ్రామాల ప్రజల రాకపోకల కష్టాలు పూర్తిగా తొలగిపోయి రవాణా సౌకర్యం ఎంతో మెరుగైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.