సూరత్‌లో దారుణం: చిన్నారుల మందుగా జంతువుల టానిక్ విక్రయిస్తున్న మెడికల్ షాప్ యజమాని అరెస్ట్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: సూరత్
గుజరాత్‌లోని సూరత్‌లో ప్రజారోగ్యాన్ని హరించే దారుణ ఘటన వెలుగు చూసింది. జంతువులకు వాడే టానిక్‌ను చిన్న పిల్లలకు ఇచ్చే మందుగా నమ్మిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న మెడికల్ షాప్ యజమాని మహమ్మద్ సాజిద్ ఇబ్రహీం ముల్లాను సూరత్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోపీపురా ప్రాంతంలో ఈ అక్రమ దందా సాగుతోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజ్‌దీప్‌సింగ్ నకుమ్ బుధవారం తెలిపారు. జంతువుల లిక్విడ్‌ను చిన్న బాటిళ్లలో నింపి నకిలీ లేబుల్స్ అంటించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.