రోడ్డు భద్రతపై ప్రయాణికులకు కలిదిండి పోలీసులు ప్రత్యేక అవగాహన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కలిదిండి
ప్రమాదానికి గురైన బైక్‌ను ప్రదర్శిస్తూ హెల్మెట్ ప్రాముఖ్యతపై కలిదిండి పోలీసులు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని ఏలూరు జిల్లా పోలీసులు సూచించారు. వర్షాల కారణంగా రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాలను లక్కవరం పోలీసులు వెంటనే తొలగించి రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా వేగవంతమైన చర్యలు చేపట్టారు.